panchayat election: ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

55

panchayat election: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి దశలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా తొలిరోజు నామినేషన్ల పర్వం మొదలైంది. మూడు రోజులపాటు కొనసాగనున్న నామినేషన్ల ప్రక్రియలో ఉదయం 10.30 నుంచి సా. 5 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఈనెల 31 సాయంత్రం 5 వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 9న తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన జరుగుతుండగా.. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో ఈ తొలిదశ పోరు జరగనుంది.

ప్రభుత్వం భారీ ఎత్తున ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుండగా.. ఎన్నికల కమిషనర్ మాత్రం ప్రత్యేక నిఘా విధించారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకగ్రీవాలైన పంచాయతీలకు భారీ ఎత్తున నగదు నజరానా ప్రకటిస్తూ జీవో ఇవ్వగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవాలైన పంచాయతీల కోసం ప్రత్యేక నిధులు వెచ్చిస్తామని.. ప్రత్యేక శ్రద్ద తీసుకొని అభివృద్ధి చేస్తామని ప్రకటనలు చేశారు. దీంతో అధికార పార్టీ కోరినట్లుగా ఏకగ్రీవాలపై మొగ్గుచూపుతారా.. లేక పోరుకు దిగుతారా అన్నది మరో మూడు రోజులు ఆగితే కానీ తెలియదు.