హిందు యువతులను చైనాకు అమ్ముతున్న పాకిస్థాన్

131

హిందు యువతులను చైనాకు అమ్ముతున్న పాకిస్థాన్

దాయాది దేశం పాకిస్థాన్ లో మైనారిటీలుగా ఉన్న హిందు, క్రిస్టియన్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. హిందు, క్రైస్తవ యువతులను ఫోర్స్‌డ్ బ్రైడ్స్ గా చైనా యువకులకు కట్టబెడుతున్నారంట. ఈ విషయాలను అమెరికా అంబాసిడర్ సామ్యూల్ డీ బ్రౌన్‌బ్యాక్ మీడియాకు తెలిపారు. పాకిస్థాన్ లోని మైనారిటీలకు కనీస హక్కులు లేవని ఆయన అన్నారు.

2018-19 మధ్య కాలంలో 629 మంది పాకిస్థానీ హిందు యువతులు బలవంతంగా చైనాకు పంపబడ్డారని వివరించారు. ఈ యువతుల వివరాలతో కూడిన జాబితాను కూడా మీడియాకు చూపారు సామ్యూల్. కాగా ఈ జాబితా 2019 సంవత్సరంలోనే విడుదలవగా, పలు వార్త పత్రికలు దీనిపై కథనాలు కూడా రాశాయి. ‘ఫోర్స్‌డ్ బ్రైడ్స్’ను చైనా తీసుకెళ్లి, అక్కడ వ్యభిచారంలోకి దించుతున్నట్లు సామ్యూల్ వివరించారు.