అజిత్ దోవల్ కార్యాలయం, ఇంటివద్ద పాక్ ఉగ్రవాదులు రెక్కీ

240

ఇండియన్ జేమ్స్ బాండ్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ పై పాకిస్థాన్ నిఘా పెట్టింది. దేశ రక్షణ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న దోవల్ ఎంతో కాలంగా పాకిస్థాన్ టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద పాకిస్థాన్ సానుభూతిపరుడైన ఉగ్రవాది రెక్కీ నిర్వహించినట్లుగా బయటపడింది. ఇటీవల అరెస్టైన జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎమ్) ఉగ్రవాది హిదాయత్ ఉల్లా మాలిక్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. దింతో అజిత్‌ దోవల్‌ కార్యాలయం, నివాసం వద్ద భద్రతను పెంచారు.

మాలిక్ బయటపెట్టిన అంశాల ఆధారంగా, ఆయన భార్య, ఛత్తీస్ ఘడ్ లోని ఓ కళాశాల విద్యార్థిని తోపాటు బీహార్ కు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని పలు మార్లు ప్రశ్నించారు. రెక్కీకి సంబందించిన వివరాలను అధికారులకు తెలిపారు. కాగా మాలిక్ మే 24, 2019లో శ్రీనగర్ నుంచి విమానంలో ఢిల్లీ వచ్చాడు. మే 25న పలు ముఖ్యకార్యాలయాలను వీడియో తీశాడు. అందులో అజిత్ దోవల్ కార్యాలయం. ఇల్లు కూడా ఉందని మాలిక్ తెలిపాడు. అనంతరం కశ్మీర్‌కు బస్సులో తిరిగి వెళ్లినట్లు చెప్పాడు. ఆ వీడియోలను వాట్సాప్‌ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ‘డాక్టర్’ అనే వ్యక్తికి పంపినట్లు తెలిపాడు.

సాంబా సెక్టర్‌లోని సరిహద్దు ప్రాంత్రాన్ని కూడా వీడియో తీసినట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసుల ఇంటరాగేషన్‌లో మాలిక్‌ వెల్లడించాడు. 2020 మేలో జరిగిన ఆత్మహుతి దాడి కోసం కారును ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. అలాగే మరో ముగ్గురు జైష్ ఉగ్రవాదులు ఇర్ఫాన్ తోకర్, ఉమర్ ముష్తాక్, రాయీస్ ముస్తఫాతో కలిసి 2020 నవంబర్‌లో షోపియన్‌లోని జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌కు చెందిన నగదు వ్యాన్ నుంచి రూ.60 లక్షలను దోచుకున్నట్లు ఒప్పుకున్నాడు.

అజిత్ దోవల్ కార్యాలయం, ఇంటివద్ద పాక్ ఉగ్రవాదులు రెక్కీ