పాక్ పై సర్జికల్ స్ట్రైక్..

58

పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు భారత్ ప్లాన్ చేస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి అన్నారు. భారత్ లో జరుగుతున్న తిరుగుబాట్లు, ధర్నాలు, కాశ్మీర్ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మళ్ళించాలంటే సర్జికల్ స్ట్రైక్ చెయ్యాలని భారత్ భావిస్తున్నట్లు తెలిపారు. యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తానీలకు, అంతర్జాతీయ సమాజానికి ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశానని ఖురేషి తెలిపారు. భారత్ అలాంటి చర్యకు దిగితే, పాకిస్తాన్ దానికి తగిన జవాబు ఇస్తుందని. దాడి జరిగే అవకాశం గురించి పాకిస్తాన్ చాలా దేశాలకు సమాచారం అందించిందని చెప్పుకొచ్చారు. ఇక ఖురేషి వ్యాఖ్యలపై భారత్ స్పందించలేదు.

పాక్ పై సర్జికల్ స్ట్రైక్..