గుళ్ళ రాజకీయం అయిపాయె.. ఇక విగ్రహాల రాజకీయం స్టార్ట్?!

255

ఏపీ రాజకీయాల గురించి స్టార్ట్ చేయాలి అంటే చాలానే ఉంటాయి. దక్షణాది రాష్ట్రాలలో ఎక్కడా కూడా ఈ రేంజ్ రాజకీయం కనిపించదు. కాదేదీ రాజకీయాలకు అనర్హం అనుకుంటే అది ఏపీకి ఖచ్చితంగా సరిపోతుంది. తొలిసారి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో కాకలు తీరిన నేత కాకపోయినా ఆ పార్టీ ఎజెండా మాత్రం చాలా బలంగా ఉంది. అసలే రాజకీయాలను అవపోసన పట్టిన చంద్రబాబు రేంజికి తట్టుకోవాలంటే ఆ మాత్రం ఉండాలన్నది విశ్లేషకులు చెప్పే మాట. మరోవైపు బీజేపీ-జనసేన కలిసిపోయి మూడవ శక్తిగా మారడంతో ఇక్కడ రాజకీయాలు ట్రయాంగిల్ లో ఎప్పుడు రసవత్తరంగానే సాగుతున్నాయి.

అసలే అధికార పార్టీ మొండిగా ఉంటే.. ప్రభుత్వ వ్యవస్థలు సైతం అంతే మొండిగా ఉండడం అప్పడప్పుడు థ్రిల్లర్ సినిమా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. హైకోర్టు, ఎన్నికల కమిషన్ లాంటి వ్యవస్థలను కూడా సీఎం జగన్ ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించడం ట్విస్టుల మీద ట్విస్టులతో రాజకీయాలు నడవగా మధ్యలో ప్రతిపక్షాలు ఎంటరై ప్రజలలో ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయాలని చూడడం ప్రజలకు రోజుకో టాపిక్ గా మారుతుంది. ఇక మొన్నటి వరకు రాష్ట్రంలో గుడి, దేవుడు, విగ్రహాలు లాంటి అంశాలపై రాజకీయాలు నడిచిన సంగతి తెలిసిందే.

ఏ పార్టీకి ఆ పార్టీ తమను తాము హిందూ వాదులుగా కలరింగ్ ఇచ్చేందుకు అందరూ ఆరాటపడ్డారు. మొత్తానికి ఇప్పుడు ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. ఇక ఇప్పుడు ఇక్కడ విగ్రహాల రాజకీయం మొదలయ్యేలా కనిపిస్తుంది. తాజాగా వైఎస్ఆర్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీలో రంగా, అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేయడానికి టిడిపి వ్యూహం పన్నింది అని తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి అని ఆయన అన్నారు.

ఇక అంబటి రాంబాబు మాట్లాడుతూ, రంగా అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేస్తే వాళ్ళ అభిమానులు రెచ్చిపోతారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే రాష్ట్రంలో అలజడి రేగుతుంది. దీనిని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు వ్యూహం పన్నారని వ్యాఖ్యానించారు. దానికి టీడీపీ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. అజెండా వైసీపీదేనని అందుకే ముందే హింట్ ఇచ్చి మా పార్టీపై నెట్టాలని చూస్తున్నారని.. అదే జరిగితే ఊరుకొనేది లేదని.. విగ్రహాల జోలికి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. మరి ఈ పరిస్థితి ఎలా అవుతుందో ఏమో చూడాల్సి ఉంది.

గుళ్ళ రాజకీయం అయిపాయె.. ఇక విగ్రహాల రాజకీయం స్టార్ట్?!