బ్రేకింగ్ న్యూస్:- ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉంది.. ఈడీ అధికారులకు తెలిపిన మత్తయ్య

65

ఓటుకు నోటు కేసు విచారణ వేగవంతం చేశారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఏ 4 గా ఉన్న మత్తయ్యను గత కొద్దీ రోజులుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఆయన కేసుకు సంబంధించి ఈడీ అధికారులకు వాగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు డీల్ కుదర్చమంటేనే తాను సెబాస్టియన్ తో డీల్ కుదిర్చినట్లు తెలిపారు. వేము నరేందర్ రెడ్డికి ఓటు వేస్తె ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని, ఎవరికీ ఓటు వెయ్యకుండా ఉంటే మూడు కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నట్లు మత్తయ్య తెలిపారు. డీల్ లో భాగంగా మొదట 50 లక్షలు ఇవ్వడం జరిగిందని వివరించారు.

ఈ కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ పాత్ర ఉన్నట్లు ఒప్పుకున్నారు. ఇక డబ్బులు ఇస్తూ పట్టుబడిన విషయం తాను టీవీలో చూసి తెలుసుకున్నానని మత్తయ్య తెలిపారు. అనంతరం తనను లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ తరలించారని తెలిపారు మత్తయ్య. కాగా 2015 లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్టీఫెన్ సన్ ను కొనేందుకు రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో అతడి ఇంటికి వెళ్లి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కాగా మత్తయ్య వాంగ్మూలతో కేసు ఓ కిలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది.

బ్రేకింగ్ న్యూస్:- ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉంది.. ఈడీ అధికారులకు తెలిపిన మత్తయ్య