శ్రీశైలంలో అన్యమతస్తుల షాపులు సీజ్

81

హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అన్యమతస్తుల దుకాణాలను సీజ్ చేశారు అధికారులు. సిద్దరామప్ప కాంప్లెక్స్ లో అగ్రిమెంట్ పూర్తి కావడంతో 13 ముస్లిం మైనారిటీలకు చెందిన షాపులను అధికారులు సీజ్ చేశారు. కాగా అన్యమతస్తుల షాపుల విషయమై గతంలో దుకాణాలదారులు హైకోర్టును ఆశ్రయించారు. కానీ న్యాయస్థానంలో వారికీ చుక్కెదురైంది. ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. ఇక అన్యమతస్తులు దుకాణాలు నిర్వహించడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు సీజ్ చేశారు. ఇక శ్రీశైలంలో అన్యమతస్తుల పెత్తనం పెరిగిందంటూ తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. హిందూ ధార్మిక సంస్థల్లో ఇతర మతాలవారికి పనేంటని అన్నారు.