ఉస్మానియా యూనివర్సిటీని ఖాళీ చెయ్యండి.. లేదంటే చర్యలు తప్పవు

94

ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్స్ లో అనధికారికంగా ఉంటున్న వారందరూ వెంటనే ఖాళీ చెయ్యాలని విశ్వవిద్యాలయ అధికారులు ఆదేశించారు. తమకు తాముగా ఖాళీ చెయ్యకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులను పెట్టి బయటకు పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం తరగతులు జరగడం లేదు.

దింతో హాస్టల్స్ అన్ని క్లోజ్ చేశారు. విద్యత్, నీటి సరఫరా నిలిపి వేశారు. కాగా నీరు విద్యుత్ లేనప్పటికీ కొందరు వ్యక్తులు విశ్వవిద్యాలయంలోని ఉంటున్నారు. అనధికారికంగా హాస్టల్ గదుల్లో ఉంటున్నారు. గత కొద్దీ రోజులుగా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొనడంతో, విశ్వవిద్యాలయంలో శాంతిభద్రతల సమస్య ఉందని అమలులో ఉన్న నిబంధనలను ఉల్లంగిస్తూ హాస్టళ్లలో అక్రమ మరియు అనధికారికంగా బస చేయడాన్ని విశ్వవిద్యాలయం తీవ్రంగా పరిగణించిందని ఒక ప్రకటనలో తెలిపింది.

ఉస్మానియా యూనివర్సిటీని ఖాళీ చెయ్యండి.. లేదంటే చర్యలు తప్పవు