ఆన్ లైన్ లో అప్పులు.. మరో సాఫ్ట్ వేర్ బలి

49

ఆన్ లైన్ అప్పులకు మరో ప్రాణం బలైంది. అప్పు తీసుకోని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడో వ్యక్తి. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సునీల్, అప్పుకట్టలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజేంద్ర నగర్, కిస్మత్ పూర్ లోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా గుంటూరుకు చెందిన సునీల్ గత కొంత కాలంగా ఆన్ లైన్ యాప్స్ లో లోన్ తీసుకుని సమయానికి చెల్లిస్తూ ఉండేవారు. కొద్దీ రోజుల క్రితం అప్పుతీసుకున్నాడు..

అయితే ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో లోన్ అప్పు చెల్లించలేక పొయ్యాడు. దింతో ఆన్ లైన్ లోన్ ఇచ్చిన కంపెనీ సునీల్ ఫోన్ లోని కాంటాక్ట్స్ కి సందేశాలు పంపింది.. అప్పు ఎగవేత దారుడని అతడి ఫొటోస్ షేర్ చేసి, తమకు సమాచారం ఇవ్వాలని సదరు ఆన్ లైన్ లోన్స్ ఇచ్చే కంపెనీ సందేశాలు పంపింది,. దింతో అవమానంగా భావిస్తున్న సునీల్ బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఆన్ లైన్ లో అప్పులు.. మరో సాఫ్ట్ వేర్ బలి