మనుషులు లేని దివిలో ఒక మహిళ.. ఇద్దరు పురుషులు.. ఏం చేశారు?

891

మనుషులుండని ఓ దీవిలో ముగ్గురు వ్యక్తులు నెల రోజులపాటు ఉన్నారు. వంటిమీద బట్టలు తప్ప ఏమి లేకుండా గడిపారు. చలికి వణుకుతూ,ఎండకు ఎండుతూ అక్కడ ఉన్న వస్తువులతో షెల్టర్ ఏర్పాటు చేసుకొని బ్రతుకు పోరాటం చేశారు. కేవలం కొబ్బరి, కొబ్బరి నీళ్లు తాగి 33 రోజులు జీవించి, కోస్ట్ గార్డ్ అధికారుల కంటపడి రక్షింపబడ్డారు. ఈ ఘటన అమెరికా సమీపంలోని బహమాన్ ద్వీపంలో చోటుచేసుకుంది.

విహారయాత్ర నిమిత్తం క్యూబాకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పురుషులు బోట్ పై బయలుదేరారు. అయితే అది బహమాన్ దీపం సమీపంలోకి రాగానే మునిగిపోయింది. దింతో వారు ఈతకొట్టుకుంటూ సముద్రంలోంచి బయటపడి బహమన్ దివికి చేరుకున్నారు. నెలరోజులపాటు సాయం కోసం వెతికారు. గస్తీ నిమిత్తం ఫిబ్రవరి 8న దివి వైపు హెలికార్టర్ లో వచ్చిన అమెరికా సిబ్బంది హెలికాఫ్టర్ వీరి కంటపడింది. దింతో వారికీ సిగ్నల్స్ ఇవ్వడం ప్రారంభించారు.

వీరిని గమనించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది పైనుంచే ఆహార పదార్ధాలను అందించారు. సమాచారం కోసం ఓ రేడియాకూడా ఇచ్చారు. వెంటనే ఇంకో హెలికాప్టర్ కు సమాచారం అందించారు. ఫిబ్రవరి 9 న మరో హెలికాప్టర్ వచ్చింది వారిని రక్షించి, వారిని ఫ్లోరిడాలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. 33 రోజులపాటు కొబ్బరినీరు తాగి, కొబ్బరి తిని ఇంత ఆరోగ్యాంగా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మనుషులు లేని దివిలో ఒక మహిళ.. ఇద్దరు పురుషులు.. ఏం చేశారు?