వీడు మగాడ్రా బుజ్జి.. 27 మంది భార్యలు, 150 మంది పిల్లలు

686

ఓ వ్యక్తికి ఎంతమంది భార్యలుంటారు. ఒకరు లేదా ఇద్దరు. భారత్ లాంటి దేశాల్లో అయితే ఒక్కరినే పెళ్లిచేసుకోవాలి.. వేరే వారిని చేసుకోవాలి అంటే ఉన్నవారికి విడాకులు ఇవ్వాలి. సరైన కారణం లేకుండా కోర్టులు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోవు. అయితే బ్రిటీష్ కొలంబియాకు చెందిన విన్‌స్టన్ అనే 64 ఏళ్ల వ్యక్తి ఏకంగా 27 మందిని పెళ్లి చేసుకున్నాడు. వారిలో 22 మందికి పిల్లలు పుట్టగా మరో ఐదుగురికి పిల్లలు కలగలేదు. ఈ 22 మందికి 150 మంది సంతానం.

27 மனைவிகள், 150 குழந்தைகளுடன் கூட்டுக் குடும்பமாக ஒரே வீட்டில் வசிக்கும்  நபர் | My Dad, His 27 Wives, 150 Kids: Canadian Teen's TikTok on World's  Largest Polygamist Cult is Viral– News18 Tamil

వీరందరికి ఒకే తండ్రి. ఇక ఆ ఇంట్లో 160 మంది కుటుంబ సభ్యులు ఉంటారట. ఈ విషయాన్నీ విన్‌స్టన్ సంతానంలో ఒకరైన మెర్లిన్ బ్లాక్‌మోర్ తెలిపారు. మెర్లిన్ 149 మంది తోబుట్టువులను కలిగి ఉన్నాడట. అయితే ఆయనకు అందులో సగం మంది పేర్లు కూడా తెలియదట. ఇక 27 మంది తల్లులలో సొంత తల్లిని మామ్ అని పిలిచి మిగతా 26 మంది చవితి తల్లులను పేరుతో మదర్ అని పిలుస్తారంట. అయితే 19 ఏళ్ల మెర్లిన్ కు తన తండ్రి విన్‌స్టన్ కు మాటలు లేవంట.

Canada Fact Daily on Twitter: "Jul 24 2017 - Winston Blackmore found guilty  of polagamy in BC; Bishop of his compound in Bountiful he fathered 145 kids  with 27 wives… https://t.co/rE10h6Nx3H"

దింతో అతడు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడట. ఇక ఎప్పుడైనా వేడుకలు జరిగితే ఇంటికి వేల్తాడట. ఇంత పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అంతమందిని పెళ్లి చేసుకుంటే అతడిపై కేసు పెట్టలేదా అంటే కేసు పెట్టారు. అతడిని ఆరునెలల పాటు గృహనిర్బంధం కూడా చేశారు. కానీ అతడు మారలేదు. అంతే పెళ్లి చేసుకొని పిల్లలను కంటున్నాడట. తన కొడుకుల్లో 2 ఏళ్ల నుంచి 42 ఏళ్ల పిల్లలు ఉన్నారట. ఇప్పుడు మరికొంతమంది భార్యలు గర్భవతులుగా ఉన్నారని మెర్లిన్ తెలిపాడు. తమ కుటంబం వేగంగా వృద్ధి చెందుతుందని అతడు ఆనందం వ్యక్తం చేశాడు.

27 మంది భార్యలు, 150 మంది పిల్లలు