ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే.. అమ్మాయిలకు కాలేజీ సర్క్యూలర్

248

ఇదేదో వింతగా అనిపిస్తుంది కదూ.. అవును మాములు వింత కాదు పెద్ద వింత. అమ్మాయిలు మీకు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం నాటికీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలని ఓ కాలేజీ ఏకంగా సర్క్యూలర్ జారీ చేసింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషమ్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది.  ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో గల సెయింట్ జోన్స్ కళాశాల పేరుతో ఉన్న ఈ సర్క్యూలర్ ఉత్తరప్రదేశ్ దాటి దేశ సరిహద్దుల వరకు చేరింది. దీనిపై ప్రో.ఆశిష్ శర్మ సంతకంతో జనవరి 14 న జారీ చేసినట్లు ఉంది. అయితే ఈ సర్క్యూలర్ లో రాసిన వివరాలను ఓ సారి పరిశీలిస్తే ప్రతి అమ్మాయికి తప్పనిసరిగా బాయ్ ఫ్రెండ్ ఉండాలి. బాయ్ ఫ్రెండ్ ఉండటమే కాదు అతడితో ఫోటో దిగి కాలేజీకి పంపాలని ఉంది. ప్రేమను పంచండి అంటూ సర్క్యూలర్ కింద సలహా కూడా ఉంది.

అయితే మొదట ఈ ఆదేశాలు విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యాయి. అవి ఇటు ఇటు తిరుగుతూ బయటకు వచ్చాయి. దింతో చాలామంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కళాశాలకు ఫోన్ చేసి ప్రశ్నించారు. అయితే దీనిపై స్పందించిన ప్రిన్సిపాల్ ఎస్పీ. సింగ్ సర్క్యూలర్ తాము జారీచెయ్యలేదని తెలిపారు. ఎవరో కళాశాల ప్రతిష్టను బంగబరిచేందుకు ఈ విధంగా చేశారని వివరణ ఇచ్చారు. ఆశిష్ శర్మ అనే లెక్చరర్ తమ కాలేజీలో లేరని అయన తెలిపారు. దీనిని తయారుచేసిన వ్యక్తులను పట్టుకుంటామని తెలిపారు. అయితే అమ్మాయిలను హడలెత్తించేందుకు ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైనా ఈ పని చేసి ఉంటారని తాము భావిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సింగ్ తెలిపారు.

ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాల్సిందే.. అమ్మాయిలకు కాలేజీ సర్క్యూలర్