ఓటు వేసి కన్నుమూసిన వృద్ధురాలు

148

ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాలో మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు సజావుగా సాగాయి. చిత్తూరు, కడప జిల్లాలో అధికంగా ఘర్షణలు జరిగాయి. ఇక ఇదిలా ఉంటే ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలు, ఓటు వేసి ఇంటివచ్చిన తర్వాత మృతి చెందింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్.ఎన్ పేట మండలం ఫోక్స్ దర్ పేటకు చెందిన గొలివి గోవిందమ్మ(90) అనే వృద్ధురాలు ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఇంటికి చేరుకుంది. తదనంతరం అస్వస్థతకు గురైన ఆమె మృతి చెందింది.

ఓటు వేసి కన్నుమూసిన వృద్ధురాలు