10 వేలమందికి ఉద్యోగాలు

137

ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వాహన తయారీ హబ్ ను తమిళనాడులో ఏర్పాటు చెయ్యనున్నారు. 2400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ వాహన తయారీ హబ్ నెలకొల్పనున్నట్లు ఓలా తెలిపింది. దీని ద్వారా ప్రతి ఏడాది 20 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ హబ్ 10 వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తుందని ఓలా ప్రతినిధులు తెలిపారు. దింతో త్వరలోనే విద్యుత్తు వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చే ప్రణాళికను ఓలా వేగవంతం చేసినట్లు అయింది.

దీనిపై కంపెనీ ఛైర్మన్‌, సీఈవో భవేష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది ఓలాకు కీలకమైన మైలు రాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యాధునిక తయారీ కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్లాంట్‌లో తయారయ్యే ఉత్పత్తులను భారత్‌ సహా ఐరోపా, ఆసియా, లాటిన్‌ అమెరికా వంటి మార్కెట్లలో విక్రయించేలా ఓలా ప్రణాళిక సిద్ధం చేసింది.

10 వేలమందికి ఉద్యోగాలు