Odisha lover : ప్రియురాలి కోసం బాబా వేషం.. చివరకు ఏమైందంటే?

195

ప్రియురాలిని కలవక చాలా రోజులు అయింది. ఇలాగైనా వారి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఓ బాబా వేషం వేసి ప్రియురాలి గ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలో అటు ఇటు తిరిగాడు. అనంతరం ప్రియురాలి ఇంటిచుట్టూ మూడు రౌండ్లు వేశాడు. అక్కడ ఉండే పిల్లలు స్వామీజీని గమనించి పెద్దలకు సమాచారం ఇచ్చారు. దింతో స్వామిని నిలదీశారు గ్రామస్తులు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి గడ్డం పట్టుకొని లాగేశాడు. దింతో అదికాస్తా ఉంది వచ్చింది. ఇదే సమయంలో గ్రామస్తులు దాడికి యత్నించడంతో అసలు విషయం తెలిపాడు. తాను గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని ఆమె కొససే ఇక్కడకు వచ్చానని వివరించాడు.

దింతో అతడిని వదిలేశారు. కాగా ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని జాజ్ పూర్ రోడ్ ఫెర్రో క్రోమ్ గేటు కాలనిలో శనివారం జరిగింది. అయితే తన ప్రేయసి తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో ఆమెను బందించారని అందుకే, ఫోన్ కూడా ఇవ్వడం లేదని. అందుకే ఆమెను చూసేందుకు ఇలా వచ్చానని వివరించారు. అయితే ఈ ప్రేమికుడు చేసిన పనికి స్థానికులు పడీపడీ నవ్వుతున్నారు. ప్రేమికురాలికోసం ఎలా వేషం వేసుకొని రావడం అవసరమా ఇప్పుడు మేము దాడి చేస్తే ఏం చేసేవాడివి.. ఇంకో సారి ఈ కాలనీ వైపుకు రావద్దని గట్టిగ వార్నింగ్ ఇచ్చి పంపారు.

Odisha lover : ప్రియురాలి కోసం బాబా వేషం.. చివరకు ఏమైందంటే?