student turns into daily wager : కాలేజ్ ఫీజు కట్టడానికి కూలీగా మారిన విద్యార్థిని

120
Odisha engineering student turns into daily wager : కాలేజ్ ఫీజు కట్టడానికి కూలీగా మారిన విద్యార్థిని

ఇష్టపడి వీధి దీపాలకింద చదువుకొని ఎందరో గొప్పవారు అయ్యారు. పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. మరికొందరు చదువు మీద ఉన్న ఇష్టంతో ఓ వైపు పనిచేసుకుంటూ మరో వైపు చదువుకుంటుంటారు. ఆలా చదువుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది రోసి అనే విద్యార్థిని. ఒడిశ్శాలోని పూరీ కి చెందిన రోసి అనే విద్యార్థిని పేద కుటుంబంలో జన్మించింది. కష్టపడి ఇంటర్ వరకు నెట్టుకొచ్చింది. ఇంటర్ అనంతరం ఆమెకు ఇంజినీరింగ్ సీటు వచ్చింది. ఇంజినీరింగ్ అంటే ఫీజు భారీగానే ఉంటుంది. తన తల్లిదండ్రులు అంత డబ్బు పెట్టె స్థితిలో లేరు.

వారి భాదను అర్ధం చేసుకున్న రోసి డైలీ కూలీగా మారింది. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్తూ… రాత్రి సమయంలో చదువుకుంటుంది. అయితే ఈ విషయాన్నీ కొందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. రోసి చదువుకయ్యే ఖర్చునంతా భరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆపన్న హస్తం అందిస్తే తానూ అనుకున్న లక్ష్యం సాధిస్తానని రోసి వెల్లడించింది.

student turns into daily wager : కాలేజ్ ఫీజు కట్టడానికి కూలీగా మారిన విద్యార్థిని