కూతురి బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పిన ఒబామా

72

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పెద్ద కూతురు మాలియా బాయ్ ఫ్రెండ్ గురించి తెలిపారు. తాను రాసిన పుస్తకం ‘ ఏ ప్రామిస్డ్‌ లాండ్‌’ ప్రొమోషన్ లో భాగంగా పలు చాన్నాళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఒబామా. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ లో ఫ్యామిలీతో కలిసి హోం క్వారంటైన్ లో గడిపిన అనుభవాలను పంచుకున్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో నెలరోజులపాటు ఇంట్లో కుటుంబంతో ఆడుకుంటూ చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తూ సరదాగా గడిపామని, ఆ నెలరోజులు తమతోపాటు మాలియా బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారని తెలిపారు. రాత్రి పూటకూడా ఆటలు ఆడుకునేవారిమని, కానీ కొద్దీ రోజులకే బోర్ గా ఫీలయ్యామని వివరించారు. అప్పుడప్పుడు మాలియా, సాశ, మాలియా బాయ్‌ఫ్రెండ్‌కు కార్డ్సు కూడా నేర్పించానని ఒబామా అన్నారు.

మాలియా బాయ్‌ఫ్రెండ్‌ బ్రిటీష్‌ వ్యక్తి. ఉద్యోగం చేస్తున్నాడు. మా కుటుంబంలోకి అతడ్ని ఆహ్వానించాము. మొదట తనకు అతడు నచ్చలేదని వివరించారు. కానీ, చాలా మంచి వ్యక్తి అని తెలిపారు. మాలియా బాయ్ ఫ్రెండ్ వలన 30 శాతం తిండి ఖర్చు పెరిగిందని ఒబామా అన్నారు.

కూతురి బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పిన ఒబామా