వాయిదా పడిన నుమాయిష్

65

నుమాయిష్‌పై కరోనా ప్రభావం పడింది. కోవిడ్ ఎఫెక్ట్‌తో నుమాయిష్ ఈ ఏడాది వాయిదా పడింది. కొత్త సంవ‌త్స‌రంతో పాటు హైద‌రాబాద్‌కు ప్ర‌తి ఏడాది మ‌రో పండుగ వ‌చ్చేది. అదే నాంప‌ల్లి నుమాయిష్. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా నుమాయిష్‌ను ఈ ఏడాది తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.

కరోనా కారణంగానే దీనిని వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. అయితే ఎప్పుడు ప్రారంభిస్తారు అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఈటెల తెలిపారు. కాగా ప్రతి ఏడు జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ నుమాయిష్ జరిగేది. ఈ ఎగ్జిబిషన్ ను వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తయారైన వివిధ వస్తువులను ఈ ఎగ్జిబిషన్ లో అమ్మకానికి ఉంచుతారు.

45 రోజులపాటు సాగే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా దీనిని వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు.

వాయిదా పడిన నుమాయిష్