ఎన్టీఆర్ సైకిల్, రజినీకాంత్ గుర్తు కూడా సైకిలే..

73

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టేందుకు త్వరత్వరగా అడుగులు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న రజినీ, వచ్చే ఏడాది జనవరిలో పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్ గా మారనున్నట్లు అభిమానుల నుంచి సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు రజినీకాంత్. అభిమానులు, సన్నిహితులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పార్టీ పెడితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై విస్తృతంగా చర్చిస్తున్నారు.

జనవరిలో పార్టీ ప్రకటన తర్వాత నేరుగా జనంలోకి వెళ్లాలనేది రజినీకాంత్ ఆలోచన. భారీఎత్తున పార్టీ సమాశం పెట్టే, రాజకీయం మొదలుపెట్టేందుకు అడుగులు వేస్తున్నారు రజినీకాంత్.. పొలిటికల్ పనులు ఎప్పుడో మొదలు పెట్టారు. సినిమాలు చేస్తూనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఒక కొలిక్కి తెచ్చినట్లుగా చెబుతున్నారు సన్నిహితులు. ఇప్పటికే రజినీకాంత్ 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కమిటీ సభ్యులను ఎంపిక చేసేశారట.

ఇక తమిళనాడులో దళిత బహుజన ఓట్లే దండిగా ఉంటాయి. రజినీఅభిమానులు కూడా ఈ రెండు క్యాటగిరీలలోనే అధికంగా ఉన్నారు. ఆయన అభిమాన సంఘం అధ్యక్షులు కూడా దళిత బహుజన సమాజానికి చెందిన వారే అధికం. వీరిని ఆకట్టుకునేలా రజినీ మేనిఫెస్టో తయారు చెయ్యనున్నారు. బీజేపీ భావజాలంతో బరిలోకి దిగుతారని సమాచారం, కానీ బీజేపీతో ఎటువంటి పొత్తు కుండదని రజినీ సన్నిహితులు చెబుతున్న మాట.

రజినీకాంత్ శుక్రవారం తన పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. దీని కోసం ఫోరం అధికారులు న్యాయవాదులతో ఢిల్లీకి వెళ్లారు. రజినీకాంత్‌ రాజకీయ పయనంలో సైకిల్‌ చిహ్నం కీలకం కాబోతుంది. అన్నామలై చిత్రం గెటప్‌ను తలపించే విధంగా సైకిల్, పాల క్యాన్‌తో రజినీ స్టైల్‌ను రాజకీయ చిహ్నంగా ఎంపిక చేయడానికి నిర్ణయించారు.

 

ఎన్టీఆర్ సైకిల్, రజినీకాంత్ గుర్తు కూడా సైకిలే