ఎన్ఆర్ఐ స్వాతి.. ఈమె గురించి తప్పక తెలుసుకోవాలి.. లేదంటే మోసపోతారు

193

రాజేష్ (పేరు మర్చాము) అనే వ్యక్తి అమెరికాలోని ఓ సాఫ్ట్ వెర్ కంపెనీలో మంచి హోదాలో పని చేస్తున్నాడు. జీతం కూడా లక్షల్లో వస్తుంది. ఇక లైఫ్ లో సెటిల్ అయ్యాడు నెక్స్ట్ ఏం ఉంటుంది? పెళ్లే కదా… పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. దింతో మ్యాట్రి మోనీలో సంబంధాలు చూడటం ప్రారంభించాడు. అర్చన అనే పేరుతో అందమైన అమ్మాయి ఫోటో కనిపించింది. ఆమె కూడా అమెరికాలోనే జాబ్ చేస్తుంది. దింతో ఆమె నంబర్ కు కాల్ చేశాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో కూడా ఒకసారి మాట్లాడండి అంటూ ఫోన్ తన తండ్రికి ఇచ్చినట్లు చేసింది..

ఆ తర్వాత తన తల్లికి ఇచ్చినట్లు చేసింది.. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటంతో రాజేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అని భావించాడు. రోజు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇలా మాట్లాడే క్రమంలో తనకు గిఫ్ట్ కావాలని కోరింది. దింతో ఓ గోల్డ్ చైన్ కొనిచ్చాడు. ఇదే సమయంలో తన స్నేహితురాలికి ప్రమాదం జరిగిందని వెంటనే 25 లక్షలు కావాలని కోరింది. నమ్మకంతో రాజేష్ 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలా అడిగినప్పుడల్లా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాడు. ఆలా 70 లక్షల రూపాయలు చేశాడు..

తనతో పరిచయం నెలలు గడుస్తుంది. రాజేష్ ఇంటి దగ్గరనుంచి కూడా పెళ్లి ఒత్తిడి పెరిగింది. పెళ్ళికి చేసుకుందాం అని అర్చనకు ఫోన్ చేశాడు రాజేష్.. మొదటి సారి ఫోన్ లిఫ్ట్ చేసి సరే అని చెప్పింది.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దింతో అనేక సార్లు ప్రయత్నించి.. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దింతో ఇటువంటి కేసులలో ఉన్న నిందితుల లిస్ట్ ను ఓ సారి పరిశీలించారు. స్వాతి అనే మహిళ ఇటువంటి నేరాలకు పాల్పడుతుందని గుర్తించారు.

ఈమె గతంలో అనేక మంది ఎన్ఆర్ఐలను పెళ్లి పేరుతో మోసం చేసింది. జైలుకు కూడా వెళ్ళింది. బెయిల్ పై బయటకు వచ్చింది. అయిన బుద్ధిరాని స్వాతి ఈ విధంగా చేస్తుంది. అయితే ఈమెకు టెక్నాలజీపై మంచి పట్టు ఉండటంతో మ్యాట్రి మోనీలో అమెరికా నంబర్ కనిపించేలా ఫోన్ నంబర్ పెట్టి, సాంకేతిక మార్పులతో ఇండియా నంబర్ కు ఫోన్ వచ్చేలా చేస్తుంది. ఇక తల్లిదండ్రుల వాయిస్, సోదరుల వాయిస్ మొత్తం ఆమె మాట్లాడుతుంది. ఇందుకోసం మొబైల్ లోని వాయిస్ మాడ్యులేషన్ యాప్ ను వాడుకుంటుంది. ఇలా అనేక మోసాలకు పాల్పడిన స్వాతిది నెల్లూరు జిల్లా కోవూరు మండలం రంగనాయకుల పేట గ్రామం.

ఈమె ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. టీచర్ గా పనిచేసే కోరం దుర్గాప్రవీణ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఘట్ కేసర్ పోచారంలో నివాసం ఉంటూ మోసాలకు పాల్పడుతోంది. లగ్జరీ లైఫ్ కు అలవాటయి మోసాలు చేస్తోంది. ఇక ఈమెను శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఎన్ఆర్ఐ స్వాతి.. ఈమె గురించి తప్పక తెలుసుకోవాలి.. లేదంటే మోసపోతారు