నోరా వీధుల్లో ఇలా తిరిగితే కుర్రాళ్ళు ఏమైపోవాలని!

373

తన డ్యాన్స్‌ శైలితో‌ ఐటెం సాంగ్స్ అంటే ఇలా ఉండాలేమో అనేలా ఈ భామ ఇరగదీస్తోంది.‌ ఐటం నుంబర్స్ తోనే బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నోరా ఫతేహి. ‘సత్యమేవ జయతే’, ‘దిల్భర్‌ దిల్బర్’‌, ‘బట్ల హౌజ్’‌లోని ‘ఓ సాకి సాకి’ పాటలతో నార్త్ ఇండస్ట్రీలో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టేసింది. ఇక మన వాళ్ళకి నోరా గురించి చెప్పాలంటే ఒకే పాటతో చెప్పేయొచ్చు. బాహుబలి ఫస్ట్ పార్టులో మనోహరి అంటూ నోరా తిప్పిన మెలికల నుండి మన కుర్రకారు ఇంకా కోలుకోనేలేదు.

 అది అలా ఉంటే నోరా ఫతేహి ఇటీవల ముంబై వీధుల్లో తిరిగినప్పడు క్లిక్ మనిపించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నోరా శరీర సౌష్టవానికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్ నెటిజన్స్.. వావ్ నోరా అంటూ నోరేళ్ల బెడుతున్నారు.  Photo: Twitter

ప్రస్తుతం ఇక్కడా అక్కడా అని లేకుండా ఇండియా సినిమాలలో ఏ ఇండస్ట్రీ పిలిచినా ఐటం నంబర్స్ వదలడం లేదు ఈ భామ. స్పెషల్‌ సాంగ్స్‌తో బిజీ బిజీగా ఉన్న నోరా ఈ మధ్య ముంబై వీధుల్లో కనిపించింది. కనిపిస్తే కనిపించింది కానీ చూసిన వాళ్ళ హార్ట్ బీట్ పెంచేలా కనిపించడమే అసలేం బాలేదు. అసలే ఆ శరీర సౌష్టవాన్ని వెండితెర మీద చూస్తేనే మనసు పారేసుకుంటుంటే ఇక లైవ్ లో అలా టైట్ బిగువులతో కనిపించేస్తే తట్టుకోవడం కష్టమా చెప్పండి. అలా కనిపించడంతో కెమెరా కళ్ళు కూడా చూడలేక క్లిక్ మనిపించాయి. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో తామెందుకు మిస్ అయ్యామా ముంబై కుర్రాళ్ళు కుళ్ళుకుంటుంటున్నారట!

నోరా వీధుల్లో ఇలా తిరిగితే కుర్రాళ్ళు ఏమైపోవాలని!