LPG cylinder price hike: బండ బాదుడు..!

186

సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. వంటింట్లో గ్యాస్ బండ గుదిబండగా మారింది. అసలే లీటర్​ పెట్రోల్​ ధర సెంచరీకి దగ్గర్లో ఉండడంతో సామాన్య ప్రజలు లబోదిబో మంటున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు గత ఐదేళ్లలో 350 శాతం పెరిగి ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు అన్న చందంగా మారింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఒకరిపై మరొకరు పోటీపడుతూ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలపై ఇప్పటికే సామాన్య ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

మధ్యతరగతి ప్రజల వంటింట్లోని రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధర మరో రూ.50 పెరిగి సమాన్యుడి నడ్డి విరుస్తోంది. పెరిగిన ధర ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. పెరిగిన ధరలతో వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్‌ ధర ప్రతిరోజూ పెరుగుతూ రూ.వందకు చేరువగా వెళ్తున్న వేళ సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగింది. తాజాగా గృహ అవసరాల సిలిండర్‌ ధర మరో రూ.50 పెరిగి ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.769కి చేరుకుంది. ఈ వారంలో పెట్రోల్ సెంచరీ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తుండడంతో సామాన్యుడు రోడెక్కి పరిస్థితి ఉండేలా కనిపించడం లేదు.

LPG cylinder price hike: బండ బాదుడు..!