టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్

188

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులో ఆయనకు ఈ వారెంట్ జారీ అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తూ 2012 కాజీపేట రైల్వే స్టేషన్‌ సమీపంలో నిర్వహించిన ఆందోళనలో దాస్యం వినయ్ భాస్కర్‌తో పలువురు యువత, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఈ ఘటనలో వినయ్‌ భాస్కర్‌తో పాటు మరో 8 మందిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తోపాటు మిగిలిన 8 మంది కూడా ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.