ఏపీలో పంచాయతీ ఎన్నికలు : కొనసాగుతోన్న నామినేషన్లు

97

ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. మూడు రోజుల పాటు తొలిదశ నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ప్రతిరోజూ ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్‌ పదవితో పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తున్నారు.

కాగా విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలిదశలో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ లో పేర్కొంది. తొలిదశలో మొత్తం 18 రెవెన్యూ డివిజన్లలోని 168 మండలాల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 3249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులు ఉన్నాయి.