భారత విపణిలోకి నోకియా ల్యాప్‌టాప్.. ధర తక్కువే

263

నోకియా, ఒకపుడు భారత విపణిలో మంచి బ్రాండ్, పదేళ్లక్రితం ఎవరిచేతిలో చూసినా నోకియా మొబైల్ కనిపించేంది.. ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత నోకియా పడిపోయింది. చైనా ఫోన్ల మార్కెటింగ్ పెరిగిపోవడం, నోకియా చిన్న ఫోన్ ధరకే చైనా ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుండటంతో వినియోగదారులు నోకియాను దూరం పెట్టారు.

ఇక ఆండ్రాయిడ్ కు దీటుగా విండోస్ ఫోన్స్ తెచ్చినా అవి క్లిక్ అవలేదు.. దింతో నోకియా మార్కెటింగ్ భారత్ లో పడిపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి ఆండ్రాయిడ్ తో అడుగుపెట్టి కొద్దిగా పుంజుకుంది. ఇక ఇప్పుడు భారత విపణిలోకి నోకియా ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది.. వీటిని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ విడుదల చేసింది.

నోకియా ప్యూర్‌బుక్‌ ఎక్స్‌14గా విలువబడే వీటి ధర రూ.59,990. 1.1 కిలోల తేలికపాటి బరువు, 16.8 ఎంఎం మందం, 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ తెర, ఇంటెల్‌ ఐ5 టెన్త్‌ జనరేషన్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ లాంటి ప్రత్యేకతలతో నోకియా ప్యూర్‌బుక్‌ ఎక్స్‌14 లభ్యం కానుంది. వీటికి ముందస్తు ఆర్డర్లు డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి.

 

భారత విపణిలోకి నోకియా ల్యాప్‌టాప్.. ధర తక్కువే