తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు

173

కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.. దీనిలో భాగంగానే హరితహారం కార్యక్రమం చేపట్టి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. ఇక ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్కులు ఏర్పాటు చేసి, హరిత వానలు అని నామకరణం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. డీజిల్, పెట్రోల్ వాహన వాడకం తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది..

దీనిలో భాగంగానే ఎలెక్ట్రిక్ వాహనాలు వాడేవారికి రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించింది. తోలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 100 శాతం రోడ్ ట్యాక్స్ ఫ్రీ తోపాటు, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలతో పాటు, ఇతర వాహనాలకూ ఈ ఆఫర్ వర్తించనుంది. తొలి 20వేల మూడు చక్రాల వాహనాలు, తొలి 10వేల ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ క్యారియర్ వాహనాలు, తొలి 5వేల ప్రైవేట్ కార్లు, 5వేల ఫోర్ వీలర్ వాహనాలకు ఉచిత రోడ్ ట్యాక్స్, ఫ్రీ రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుందని పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు