ఆవు పేడ‌తో ‘వేదిక్ పెయింట్’ తయారీ‌..

76

ఆవు పేడతో తయారు చేసిన పెయింట్ ను త్వరలో లాంచ్ చేయనున్నట్టు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.. ట్విట‌ర్ ద్వారా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ సందర్బంగా ఆవు పెండ‌తో త‌యారైన పెయింట్‌ను గురువారం ప‌రిచ‌యం చేశారు.. దీనికి ‘వేదిక్ పెయింట్’ అని నామకరణం చేశారు. ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ ద్వారా ఈ పెయింట్ త‌యార‌వుతోంది అని గ‌డ్క‌రీ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ పెయింట్ ద్వారా గ్రామీణప్రాంత ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఊతం అవుతుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక్ పెయింట్ ద్వారా గ్రామాల్లో రైతుల‌కు అద‌న‌పు ఆదాయం వస్తుందని అన్నారు. డిస్టెంబ‌ర్‌, ఎమ‌ల్ష‌న్ రూపాల్లో ఉంటుంద‌ని, గోడకు వేసిన నాలుగు గంట‌ల్లోనే ఆరిపోతుంద‌ని స్పష్టం చేశారు. ఈ వేదిక్ పెయింట్ లో విష ర‌హిత‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయని
గడ్కరీ వెల్లడించారు.