పార్లమెంటులో ఆర్థిక సర్వే 2020-21 సమర్పణ

146

దేశంలో ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిని వివరించే ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో సమర్పించారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం రచించిన ఎకనామిక్ సర్వే 2020-21, ఆర్థిక వ్యవస్థ యొక్క వివిధ రంగాల స్థితిగతులను, అలాగే వృద్ధిని వేగవంతం చేయడానికి చేపట్టాల్సిన సంస్కరణలను వివరిస్తుంది. కరోనావైరస్ లాక్డౌన్ తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ..

2021-22 ఆర్థిక సంవత్సరంలో కోలుకుంటుందని భావిస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) ఏప్రిల్-జూన్లో 23.9% , రెండవ త్రైమాసికంలో 7.5% తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి, సర్వే 7.7% సంకోచం ఉంటుందని.. తదుపరి కాలంలో V- ఆకారపు రికవరీని అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 వరకు) జిడిపి వృద్ధి 11% పెరుగుతోందని సర్వే పేర్కొంది.