బైంసాలో బీజేపీ vs ఎంఐఎం

270

బైంసా పట్టణం అల్లర్లు గొడవలతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇక్కడ రెండు వర్గాల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా మరో గొడవ రాజుకుంది. ఎంఐఎం బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. భైంసాలో ఎంఐఎం అండతో రియల్ ఎస్టేట్ అక్రమ వెంచర్లు వేస్తున్నారని.. బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేస్తామని వెల్లడించారమే. ఇప్పటికే వెంచర్లపై అధికారులకు తెలిపామని వివరించారు. అయితే బీజేపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఎంఐఎం ప్రత్యారోపణ చేసింది. రమాదేవి ప్లాట్లు, డబ్బులు అడిగారు, ఇవ్వనందుకే ఆరోపణలు చేస్తున్నారని ఎంఐఎం నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు జాబీర్ అహ్మద్ అన్నారు.

బైంసాలో బీజేపీ vs ఎంఐఎం