మన దగ్గరా ఒకరు.. ఓ నీరవ్ మోడీ.. ఓ విజయ్ మాల్యా.. రాయపాటి వారు

118

తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ విషయంలో రాయపాటి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. ఈసోదాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఓ విజయ్ మాల్యా.. ఒక నీరవ్ మోడీ.. అనే చెప్పుకునే మనకు.. మనదగ్గరా ఒకరున్నారు అనుకునే విధంగా కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎసరు పెట్టారు రాయపాటి వారు..

సీబీఐ ప్రాథమిక అంచనా మేరకు.. రాయపాటి సాంబశివరావు.. 7వేల 926 కోట్లకు కుచ్చుటోపీ పెట్టినట్లుగా తెలుస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులతో ఫేక్ కంపెనీలు ఓపెన్ చేయించి, పద్మావతి, బాలాజీ, యూనిక్ ఎంటర్‌ప్రైజర్‌, రుత్విక్‌ అసోసియేట్‌ వంటి నకిలీ కంపెనీల పేరుతో రాయపాటి సాంబశివరావు.. 7వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది.

తొమ్మిది నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి కెనరా బ్యాంకుతోపాటు మరో 9 బ్యాంకుల నుంచి 9 వేలకోట్ల రూణాలు పొందగా.. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కంపెనీ సీఎండీ చెరుకూరి శ్రీధర్, అదనపు డైరెక్టర్లు రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీష్ తదితరులను ప్రధాన బాధ్యులుగా చేస్తూ.. సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికైతే దేశంలో బయటపడిన పెద్ద బ్యాంక్ ఫ్రాడ్ ఇదే.. సీబీఐ ఈ విషయాన్ని అధికారికంగానే చెబుతోంది.

మన దగ్గరా ఒకరు.. ఓ నీరవ్ మోడీ.. ఓ విజయ్ మాల్యా.. రాయపాటి వారు