ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ

81

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టులో.. ‘కోర్టు ధిక్కరణ’ పిటిషన్ దాఖలు చేశారు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పనితీరు సరిగా లేదని ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు నిమ్మగడ్డ.