టీడీపీకి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ

69

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే 9 మంది అధికారులను విధులనుంచి తప్పించి ఒక్కసారిగా షాక్ కి గురిచేశారు.. ఆ తర్వాత గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల విధులనుంచి తప్పించారు. టీడీపీ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. మేనిఫెస్టోపై టీడీపీ వివరణ సంతృప్తికరంగా లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

అయితే ఇప్పటివరకు పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో అనేదే లేదు. ఇవి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు కావడంతో దీనికి ఇప్పటివరకు ఏ పార్టీ మేనిఫెస్టో విడుదల చెయ్యలేదు. ఇక టీడీపీ మేనిఫెస్టో విడుదల చెయ్యడం వింతగా కనిపించింది. దీనిపై రెండు మూడు రోజులపాటు చర్చ కూడా జరిగింది. టీడీపీ దీనిపై సరైన వివరణ ఇచ్చుకోలేక పోవడంతో ఎస్ఈసీ ఉపసంహరించుకోవాలని సూచించింది.

టీడీపీకి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ