Nimmagadda ramesh : వైఎస్ఆర్ గోప్ప నేత – ఎలక్షన్ కమిషనర్

146

nimmagadda ramesh kumar : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, దివంగత నేత రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో గౌరవం ఉండేదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ వలనే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఎవరైనా సరే నిజాలను నిర్భయంగా చెప్పాలని రాజశేఖర్ రెడ్డి పదే పదే చెప్పేవారని నిమ్మగడ్డ అన్నారు. ఆయనకు వ్యవస్థల పట్ల ఉన్న గౌరవం అలాంటిదని అన్నారు. కాగా నిమ్మగడ్డ, రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎన్నికల నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కొందరిని వ్యవహారశైలిని టార్గెట్ చేస్తూనే రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసి ఉంటారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ పారదర్శనంగా ఉందని తెలిపారు. అధికారులు ఒక పార్టీకి మద్దతుగా ఉండకూడదని సూచించారు. అసాధారణంగా ఏకగ్రీవాలు మంచిది కాదని, అది ప్రజాస్వామ్యా వ్యవస్థకు వ్యతిరేకమని తెలిపారు. ఎవరో అశీసులతో నేను ఎస్ఈసిని కాలేదు-ఎస్ఈసి నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. కాగా నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ నేతల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ఈ విధంగా మాట్లాడినట్లు సమాచారం.

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. రెండోవ రోజు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వార్డు సభ్యులను కూడా నామినేషన్లు వెయ్యనివ్వడం లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో సర్పంచి పదవులకు వేలంపాటలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు గ్రామాల్లో సర్పంచి పదవికి వేలం పాట నిర్వహించగా వెలుగులోకి రాని గ్రామపంచాయితిలు ఇంకా చాలా ఉండి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

Nimmagadda ramesh : వైఎస్ఆర్ గోప్ప నేత – ఎలక్షన్ కమిషనర్