Nimmagadda Ramesh : ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ చర్యలు

72

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచల నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలో అత్యధిక పంచాయితీలు ఏకాగ్రవాలు కావడంతో దానిపై దృష్టిపెట్టారు. ఈమేరకు రెండు జిల్లాల కలెక్టర్లను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నివేదిక కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిష్టితి, ఈ రెండు జిల్లాలోని పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉందని, ఏకగ్రీవాలకు పొంతలేదని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. కలెక్టర్లు వివరణాత్మక నివేదిక వచ్చిన తర్వాత, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఏకాగ్రస్తమైన పంచాయితీలను పరిశీలిస్తే

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఏకాగ్రవాలు అయ్యాయి. తొలిదఫాలో 468 పంచాయితీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 112 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం అయిన పంచాయితీల్లో 95 వైసీపీ మద్దతు దారులవి కాగా, 9 మంది టీడీపీ మద్దతు దారులు, స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది మంది ఉన్నారు. మిగిలిన 341 స్థానాలకు ఈనెల 9న పోలింగ్‌ జరగనుంది. పూతలపట్టు నియోజకవర్గంలో 152 సర్పంచులకు ఏకంగా 49 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వైకాపా 40, తెదేపా ఏడు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 137 సర్పంచి స్థానాలకుగాను 26 చోట్ల పోటీ లేకుండా పోయింది. జిల్లాలో అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు కావడంతో ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టిపెట్టింది. ఇంత పెద్ద మొత్తంలో ఏకగ్రీవాలు జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు సిద్ధమైంది.. ఈ మేరకు కలెక్టర్లను వివరణాత్మక నివేదిక కోరింది.

గుంటూరు జిల్లాలో కూడా ఏకగ్రీవాల సంఖ్య అధికంగా ఉంది. జిల్లాలో తొలివిడతలో 67 పంచాయితీల్లో ఏకాగ్రవం జరిగింది. 63చోట్ల అధికార పార్టీ సానుభూతిపరులు ఏకగ్రీవం కాగా, పీవీపాలెం మండలంలో ఒకటి, కొల్లిపర మండలంలో ఒకటి చొప్పున తెదేపా సానుభూతిపరులకు ఏకగ్రీవమయ్యాయి. మరి కొన్ని చోట్ల సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులు పంపకాలు జరిగాయి. ఇక ఏ పార్టీ మద్దతు లేకుండా ఇద్దరు ఎన్నికయ్యారు. మొదటి విధాతలోనే ఇన్ని ఏకగ్రీవమైతే.. రెండో విడత మరిన్ని ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉందని అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏకగ్రీవాలు ప్రజాస్వయ వ్యవస్థకు విరుద్దమనే విషయాన్నీ తెలిపేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఉన్నాయని అని, పంచాయితీ ఏకగ్రీవాలను ఉద్దేశిస్తూ తాజాగా నిమ్మగడ్డ వ్యాఖ్యలు చేశారు.

Nimmagadda Ramesh : ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ చర్యలు