రమేష్ కుమార్ తగ్గేలా లేరుగా

81

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుంది. ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించేది లేదని తెగేసి చెబుతుంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తాము ఎన్నికలు నిర్వహించలేమని మంత్రులు ఇప్పటికే బహిరంగంగా తెలిపారు. ఇక ఇదే విషయమై ఏపీ సీఎస్ కు మరోసారి లేఖ రాసారు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ లేఖలో కోర్టు ఆదేశాలను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రస్తావించారు.

2021 ఓటర్ల సవరణ ప్రక్రియ జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొద్దిరోజుల క్రితం గవర్నర్‌కు లేఖ రాశారు. కాగా ఎన్నికల విషయమై నిమ్మగడ్డ సీఎస్ కు లేఖరాయడం ఇది మూడో సారి..

రమేష్ కుమార్ తగ్గేలా లేరుగా