నిహారిక పెళ్ళిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన హీరోయిన్

110

నిహారిక పెళ్ళిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన హీరోయిన్

బుధవారం సాయంత్రం 8 గంటలకు మెగా డాటర్ నిహారిక కొణిదల, చైతన్య ఒక్కటయ్యారు. ఉదయపూర్ ప్యాలెస్ లో వరుడు చైతన్య నిహారిక మెడలో మూడు ముళ్ళు వేసాడు. ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీతోపాటు కొద్దీ మంది అతిధులు పాల్గొన్నారు.

పెళ్లి పీటలపై నిహారిక కుందనపు బొమ్మలా ఉంది. మెరూన్‌ కలర్‌ చీరకు ఆకుపచ్చ రంగు బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేసి సంప్రదాయ వస్త్రధారణలో అందంగా మెరిసిపోయింది. ఇక నేటితో కొణిదెల వారి తనయ జొన్నలగడ్డ వారి ఇంటి కోడలు అయ్యింది. ఈ వేడుకను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు అంటూ మెగా ఫ్యామిలీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పెళ్ళిలో అందాల రాక్షసి భామ లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

https://www.instagram.com/p/CIlG_NRl6VM/?utm_source=ig_web_copy_link

 

https://www.instagram.com/reel/CIlKEfulJqb/?igshid=7ujpjbvgu4ed