ని భార్యను ఆ దేవుడే కాపాడాలి

77

కరోనా మహమ్మారి వలన గిరాకీ లేక వ్యాపారులు నానా అవస్థలు పడుతుంటే.. ఆకతాయిలు మాత్రం వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌కు కొద్దిరోజుల క్రితం 21 ఆహారపొట్లాలను ఆర్డర్ చేశారు.. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి తప్పుడు అడ్రస్ ట్యాగ్ చేశాడు.. డెలివరీ బాయ్ అక్కడికి వెళ్లి ఆర్డర్ చేసిన వ్యక్తికీ మెసేజ్ చేశారు. దింతో సదరు వ్యక్తి డెలివరీ బాయ్ ని దుర్భాషలాడాడు..

చేసేదేమి లేక డెలివరీ బాయ్ తిరిగి రెస్టారెంట్ కి వచ్చాడు. రెస్టారెంట్‌ యజమాన్యం‌ దీనిపై భావోద్వేగంగా స్పందిస్తూ.. ‘‘ మానవత్వం లేకుండా జోక్‌ వేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ స్థానిక చిరు వ్యాపారాన్ని దెబ్బ తీసినందుకు కృతజ్ఞతలు’’ అని మెసేజ్‌ చేసింది. ఫ్రాంక్‌ చేసిన వ్యక్తి తిరిగి స్పందిస్తూ.. ‘‘ మూర్ఖుడా…. మీ హోటల్‌ ఆహారాన్ని ఎవరూ కొనరు.

నాకు ఇంటిపనులు చేసిపెట్టే భార్య ఉంది. మీ….. ఆహారం అవసరం లేదు’’ అంటూ రెచ్చిపోయాడు. చివరగా రెస్టారెంట్‌ యజమాన్యం ‘‘ నీ భార్యను ఆ దేవుడే కాపాడాలి’’ అన్న ఉద్ధేశం వచ్చేలా లాస్ట్‌ పంచ్‌ వేసింది. ఈ సంభాషణలకు సంబంధించిన స్ర్కీన్‌ షాట్లను తీసి రెడ్డిట్‌లో షేర్‌ చేయగా.. నెటిజన్లు ఆ ఆకతాయిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇటువంటి ముర్కులను బహిరంగంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు.

ని భార్యను ఆ దేవుడే కాపాడాలి