కాబోయే సీఎం ఎన్టీఆర్

1156

ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. న్యూ ఇయర్ సందర్బంగా జిల్లాలోని ఎర్రగుంటపాలెంలో నూతన సంవత్సర శుభాకాంక్షలుతో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో పాటు టీడీపీ నేతల ఫోటోలు వేశారు. ఎన్టీఆర్ పేరు కింద నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ముద్రించారు. కాగా ఈ ఫ్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎర్రగుంటపాలెంలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ మారింది. ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్నది తెలియరాలేదు.

ప్రధాన రహదారిపై ఏర్పాటు చెయ్యడంతో వచ్చే పోయేవారు వాహనాలు నిలిపిమరీ ఫ్లెక్సీని చూసివెళ్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఇక భవిష్యత్ లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్లు సమాచారం. తాత బాటలో నడిచేందుకు ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్లుగా గతంలో పలుమార్లు సంకేతాలు ఇచ్చారు. 2024 ఎన్నికల వరకు పాలిటిక్స్ లో గ్రిప్ సాదించి. 2030 అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయి పాలిటిక్స్ లోకి రానునట్లుగా తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎంట్రీ ఇస్తారా, లేదంటే కొత్తపార్టీ పెడతారా అనే దానిపై స్పష్టత లేదు.

కాబోయే సీఎం ఎన్టీఆర్