నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్

447

ప్రపంచాన్ని కొత్త ఏడాది పలకరించింది. న్యూజిలాండ్ దేశం కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టింది. దింతో అక్కడ సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా కాల్చుతూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో చాలా తక్కువ మంది పాల్గొన్నారు.

కరోనాను దృష్టిలో ఉంచుకొని ప్రజలు స్వీయ రక్షణలో భాగంగా న్యూ ఇయర్ వేడుకలకు కాస్త దూరంగా ఉన్నారు. మరో వైపు సెకండ్ వేవ్ కూడా వస్తుండటంతో ప్రజలు వెనకాదు వేశారు. ఇక గత ఏడాది కరోనా మహమ్మారితో అల్లాడింది ప్రపంచం. దాని నుంచి బయటపడక ముందే న్యూ స్ట్రెయిన్ వచ్చి పడింది. దింతో ప్రజలు బయటకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్