న్యూ ఇయర్ రోజు తలతిక్క పనులు.. గేదె మృతి

66

న్యూ ఇయర్ సందర్బంగా పీకలదాకా తాగి తలతిక్క పని చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఉయ్యూరి వారి మెరక గ్రామంలో కొందరు వ్యక్తులు కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. పీకల వరకు తాగి గోల చేశారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న అడ్డాల సత్యనారాయణ అనే వ్యక్తికి చెందిన పశువుల పాకకు నిప్పు పెట్టారు.

దింతో పశువుల పాక పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చుక్కుకొని ఓ గేదె మృతి చెందింది. మందుబాబులు చేసిన పనికి పశువుల కొట్టం పూర్తిగా కాలిపోయింది. దింతో యజమాని సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.