ప్రపంచంలో ఎక్కడ తయారైన భారత్ కు రావాల్సిందే.. అది వస్తువైన, వైరసైన.

63

భారత్ ప్రపంచదేశాలకు ఇదో మార్కెటింగ్ అడ్డా.. ఎక్కడ ఏది తయారైన భారతదేశంలో అడుగు పెట్టాల్సిందే.. అది వస్తువు అయిన వైరస్ అయిన. అవును మీరు విన్నది నిజమే.. భారత్ ప్రపంచ దేశాలకు ఓ సిరి సంపదలు కురింపించే వనరు. ఇక్కడ ఉన్న యువతను ఆకర్షించేందుకు మార్కెట్లోకి ఎన్నో కొత్త కొత్త వస్తువులు వస్తుంటాయి. ఇక వైరస్ లు కూడా అంతే. యూకేలో న్యూ స్ట్రెయిన్ వచ్చిందో లేదో భారత్ లో అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఆరుగురిలో ఈ కొత్త స్ట్రెయిన్ గుర్తించారు. యూకే నుంచి వచ్చిన మరికొందరిలో ఈ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

తెలంగాణలో కూడా ఈ స్ట్రెయిన్ వచ్చి ఉంటుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యూకే నుంచి 1200 మంది హైదరాబాద్ కి వచ్చారని. వారిలో కొందరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక న్యూ స్ట్రెయిన్ కేసులు హైదరాబాద్ లో రెండు గుర్తించారు. బెంగళూరులో మూడు, పుణెలో ఒక కేసులు వెలుగు చూసినట్టు కేంద్రం ప్రకటించింది. మరికొన్ని శాంపిల్స్ ను సీసీఎంబీకి పంపారు అధికారులు.

ఇక ఇప్పటికే పాత వైరస్ తో దేశం కకావికలం అవుతుంటే, ఇప్పుడు కొత్త వైరస్ వచ్చి దేశంలో అలజడి సృష్టిస్తుంది. దీన్ని ఎలా కట్టడి చెయ్యాలనే దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. యూకే నుంచి వచ్చే విమానాలను ఈ నెల 31 వరకు నిలిపివేశారు. విమాన ప్రయాణాలు మొదలు పెడితే కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర విమానయాన శాఖా ఏనిర్ణయం తీసుంటుందో చూడాలి.

ప్రపంచంలో ఎక్కడ తయారైన భారత్ కు రావాల్సిందే.. అది వస్తువైన, వైరసైన.