దేశంలో మరో వైరస్.. కోడి మాంసం బ్యాన్

1165

కరోనా నుంచి ప్రపంచం కోలుకోనే లేదు మరో వైరస్ వచ్చి పండింది. ఈ సారి దేశంలోని పక్షి జాతులను మట్టుబెట్టేందుకు బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. దింతో వేలసంఖ్యలో పక్షులు మృతి చెందుతున్నాయి, దేశ వ్యాప్తంగా వేలసంఖ్యలో పక్షులు ఈ వైరస్ బారినపడి మృతి చెందుతున్నాయి. నీటిలో ఉండే బాతులు, ఇతరదేశాల నుంచి వలసవచ్చే పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. నెమళ్ళు, పావురాలు, కోళ్లు, కాకులు ఈ వైరస్ కారణంగా మృతి చెందుతున్నాయి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉంది. దింతో పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాతపడుతున్నాయి.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పక్షుల మృత కళేబరాలు కలవరపెడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గత వారం వందల సంఖ్యలో కాకులు మృతి చెందాయి. రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూడా పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాతపడుతున్నాయి. దింతో కోళ్ల ఫామ్ ల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఈ వైరస్ కోళ్లకు ఎటాక్ అయితే ఫామ్ మొత్తం వ్యాపిస్తుంది. పెద్ద సంఖ్యలో కోళ్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.

ఇక హిమాచల్ ప్రదేశ్ లో చికెన్ విక్రయాలపై నిషేధం విధించారు. ఒకవేళ కోళ్ళలో ఈ వైరస్ ఉంటే మనుషులకు వచ్చే ప్రమాదం ఉంది. దింతో ముందుజాగ్రత్త చర్యగా కోడి గుడ్లు కోడిమాంసంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరు కోడిమాంసం తినకూడదని తెలిపింది. కరోనా కారణంగా పీకల్లోతు నష్టాల్లో ఉన్న కోళ్ల ఫామ్ యజమానులు బర్డ్ ఫ్లూ రావడంతో మరింత నష్టపోయే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా కోళ్ల ఫామ్స్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. కరోనా కోళ్ల ఫామ్ యజమానులను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తే చాలామంది కోళ్ల పెంపకాన్ని వదిలి వెళ్లేలా కనిపిస్తుంది.

దేశంలో మరో వైరస్.. కోడి మాంసం బ్యాన్