మదనపల్లె హత్యకేసులో కొత్త ట్విస్ట్

144

మదనపల్లె జంటహత్యల కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఈ జంట హత్యలు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కన్నతల్లే హత్యచేసిందా, లేదంటే ఇందులో ఎవరిదైనా పాత్ర ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడోవ్యక్తి తెరపైకి వచ్చాడు. హత్యలకు ముందురోజు ఓ సుబ్బారాయుడు అనే భూతవైద్యుడు జంటహత్యలు జరిగిన ఇంటికి వెళ్ళాడు.

ఇతడిని పురుషోత్తం నాయుడి బంధువులు భాస్కర్, రాజు అనే ఇద్దరు హత్యలు జరిగిన పురుషోత్తం, పద్మజ ఇంటికి తీసుకెళ్లినట్లు భూతవైద్యుడు మీడియాకు తెలిపారు. ఇంటికి వెళ్లిన వెంటనే పద్మజ తనవద్దకు వచ్చి తమ పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చిందని మంత్రించాలని తెలిపారని, దింతో తానూ ఇద్దరిని మంత్రించానని తెలిపారు. అందుకు గాను తనకు రూ. 300 ఇచ్చారని వివరించాడు భూతవైద్యుడు.

అనంతరం వెంకటరమణ స్వామి గుడికి వెళ్లి పూజాసామాగ్రి, తాయత్తులు తీసుకొచ్చామని పేర్కొన్నాడు. అయితే గుడి నుంచి తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఎవరో సన్నటి వ్యక్తి ఇద్దరి అమ్మాయిల దగ్గర కూర్చుని చెవిలో శంఖం ఊదుతూ కనిపించాడని సుబ్బరామయ్య వివరించారు. కాగా, ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు.

అయితే ఆ శంఖం ఊదిన వ్యక్తి ఎవరనే దాని గురించి పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మానసిక వైద్యులు మాత్రం పద్మజ, పురుషోత్తం నాయుడు డెల్యూషన్ అనే వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులు తమకు తామే ఓ కొత్త లోకాన్ని సృష్టించుకుని అందులో బ్రతికేస్తున్నట్లు భ్రమలో ఉన్నారని వివరించారు.

మదనపల్లె హత్యకేసులో కొత్త ట్విస్ట్