New Ration policy : నేటి నుంచి కొత్త రేషన్ విధానం

144

గతంలో రేషన్ తీసుకోవాలంటే సంతకం పెడితే సరిపోయేది.. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ వ్యవస్థ వచ్చింది. ఇక ఇప్పుడు మొబైల్ ఓటీపీ పద్దతిని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఐరిస్ ఆథెంటికేషన్ సిస్టమ్ ను తీసుకొచ్చారు రాను రాను టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో రేషన్ పంపిణి విధానంలో మార్పులు చేస్తూ వస్తున్నాయి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఓటీపీ పద్దతిని ఇంప్లిమెంట్ చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఓటీపీ విధానం ద్వారా రేషన్ పంపిణి చెయ్యనున్నారు. మొదట హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో దీనిని అమలు చేయనున్నారు. హైదరాబాద్‌లో, 5,24,656 కార్డులు రంగారెడ్డి జిల్లాలో, 4,94,881 కార్డులు

ఈ రేషన్ కార్డ్ హోల్డర్లు అంతా ఇకపై తమ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పి రేషన్ షాపులో సరుకులు తీసుకోవాలి. కాబట్టి రేషన్ కార్డులు ఉన్నవారంతా తమ మొబైల్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. చాలామంది గతంలోనే ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ లింక్ చేసుకొని ఉన్నారు. లింక్ చేసుకొని వారు ప్రభుత్వం తెలిపిన వివరాల ఆధారంగా చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అంటే రేషన్ కార్డు హోల్డర్లు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఎవరైనా రేషన్ కార్డుకు అప్లై చేయొచ్చు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి ప్రత్యేక పథకాలు ఉన్నాయి. బిలో పావర్టీ లైన్-BPL, నాన్ బీపీఎల్ పేరుతో రెండు రకాలుగా రేషన్ కార్డులు ఉంటాయి. 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా రేషన్ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు.

New Ration policy : నేటి నుంచి కొత్త రేషన్ విధానం