విషాదం.. వరుడు మృతి, వధువుతో పాటు 8 మందికి కరోనా

76

పెళ్ళైన 10 రోజులకే వరుడు మృతిచెందాడు. ఇంట్లో 8 మందికి కరోనా సోకింది. దింతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే మృతి చెందిన వ్యక్తికీ మాత్రం కరోనా నెగటివ్ గా నిర్దారణ అయింది. దింతో వారికీ కరోనా ఎలా వచ్చిందో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ వెలుగుచూసింది.

ఎన్నో ఆశలతో వివాహబంధంలోకి అడుగుపెట్టిన యువతిని దురదృష్టం వెంటాడింది. పెళ్ళైన పదిరోజులకు భర్త మరణించాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోక ముందే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నవ వదువుతోపాటు ఇంట్లోని 8 మందికి కరోనా సోకింది.

ఇక ఈ విషయమై చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నీతా కుల్‌శ్రేష్టా మాట్లాడుతూ.. ‘బాధితురాలి భర్త పెళ్లై పది రోజులు తిరక్కుండానే మరణించాడు. పెళ్లైన వెంటనే అస్వస్థకు గురయ్యాడని. ఈ నెల 4 తేదీన మృతి చెందాడని వివరించారు. మృతదేహానికి పరీక్షలు నిర్వహించాము.

కానీ కరోనా లక్షణాలు బయటపడలేదని తెలిపారు. ఇక బాధితురాలి కుటుంబంలో ఆమెతో పాటు అత్త, బావ మరికొందరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. ఇక ఎవరిని నుంచి కరోనా సోకిందో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.