తెలంగాణలో మరో కొత్త మండలం

84

తెలంగాణలో మరో కొత్త మండలం

తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కొరకు రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను 2016 అక్టోబర్ లో 31 జిల్లాలుగా విభజించారు. 2019 మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చెయ్యడంతో రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు అయ్యాయి.

ఇక మంగళవారం వరకు 584 మండలాలు రాష్ట్రంలో ఉండగా కొద్దగా మరో మండలం ఏర్పాటు చేశారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ధూళిమిట్ట కేంద్రంగా కొత్త ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇక ఈ ఉత్తరువులు 2020 డిసెంబర్ 9, బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి.

ఈ మండలంలో మొత్తం 8 గ్రామాలు ఉన్నాయి. మద్దూరు మండలం కిందున్న ధూళిమిట్ట, లింగాపూర్‌, జాలపల్లి,తోర్నల, బైరాన్‌పల్లి, బెక్కల్‌, కొండాపూర్‌,కూటిగల్‌ గ్రామాలతో ధూళిమిట్ట కేంద్రంగా మండలం ఏర్పాటు చేశారు. దింతో తెలంగాణలో మండలాల సంఖ్య 585కి చేరింది