కేరళలో కొత్త ఇన్ఫెక్షన్.. 40 మందిలో లక్షణాలు

68

కరోనా వైరస్ తో యావత్ దేశం అల్లాడుతోంది.. ఇక ఈ నేపథ్యంలోనే మరికొన్ని కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ లో కొత్త వైరస్ ను గురించారు వైద్యులు, ఇక తాజాగా కేరళ రాష్ట్రంలో కొత్త ఇన్ఫెక్షన్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ప్రభావంతో 11 ఏళ్ల చిన్నారి తనువు చాలించింది. కోజికోడ్ జిల్లాలో 40 కేసులు వెలుగుచూసినట్లుగా అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ఇన్ఫెక్షన్ అదుపులోనే ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి జయశ్రీ వెల్లడించారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా పేగుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దింతో మోషన్స్ అవుతున్నాయి. తరచుగా మలంలో రక్తం, బంక కనిపిస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి వివరితమైన కడుపునొప్పితో పాటు జ్వరం కూడా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తిలో వారం రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి.

ఐదేళ్ల లోపు పిల్లలతో పాటు, కొన్ని సార్లు పెద్దలకు కూడా ఇది ప్రాణాంతకం అవుతుంది. కాగా ఈ ఇన్ఫెక్షన్ అమెరికాలో అధికంగా కనిపిస్తుంది. అక్కడ ఏటా ఐదు లక్షల మంది ఈ ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు.

కేరళలో కొత్త ఇన్ఫెక్షన్.. 40 మందిలో లక్షణాలు