కేంద్ర బడ్జెట్‌ యాప్‌.. ఇవి తెలుసుకోండి

160

త్వరలో కేంద్ర ప్రభుత్వం 2021 – 22 కు సంబందించిన బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ కు సంబందించిన ప్రతులను సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా కొత్త యాప్ ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు బడ్జెట్ ప్రతులను వెబ్ సైట్ లో పొందే వీలుంది. దీనిని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త యాప్ రూపొందించారు. ‘Union Budget Mobile App’ పేరుతో ఆండ్రాయిడ్, ఐఒసి, విండోస్ ఫోన్లలో సపోర్ట్ చేసే విధంగా దీనిని తయారు చేశారు. ఇందులో బడ్జెట్ కు సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కాగా ఈ యాప్ ను కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ విడుదల చేశారు. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌ దీన్ని రూపొందించింది.

బడ్జెట్ కు సంబందించిన పూర్తి వివరాలు, బడ్జెట్ ప్రసంగాలు ఈ యాప్ లో పొందుపరుస్తారు. 14 రకాలైన పత్రాలను ఈ యాప్ లో పొందవచ్చు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది. పత్రాలను వీక్షించడమే కాదు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చెయ్యవచు. మనకు కావలసిన సమాచారాన్ని సెర్చ్ చేసుకునేందుకు సెర్చ్ బాక్స్ కూడా ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 1 న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ యాప్ లో డాటాను యాప్ లో అప్లోడ్ చేస్తారు. సామాన్యులకు కూడా అర్ధమయ్యే రీతిలో ఈ మొబైల్ యాప్ తీర్చిదిద్దినట్లు నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్ అధికారులు తెలిపారు.

ఇవి తెలుసుకోండి