నేపాల్ పార్లమెంటు రద్దుకు మంత్రిమండలి తీర్మానం

51

నేపాల్ పార్లమెంటును రద్దు చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది. పార్లమెంటు రద్దు సిఫారసును రాష్ట్రపతికి పంపింది క్యాబినెట్. దీంతో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం కూలే అవకాశం ఉంది. ప్రభుత్వం రద్దు తరువాత ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. ఆదివారం ఉదయం పిఎం ఓలి నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ అత్యవసర సమావేశంలో ఈ సిఫార్సును చేశారు. ఈ విషయాన్నీ ఒలి మంత్రివర్గంలో ఇంధన శాఖ మంత్రిగా ఉన్న బర్షమన్ పున్ సమావేశం తరువాత ఖాట్మండులో ప్రకటించారు.