భారత్ నుంచి వ్యాక్సిన్ స్వీకరించిన దేశాలు ఇవే.

728

కరోనా టీకా కోసం భారత్ ముందు క్యూ కడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఇప్పటికే చుట్టుపక్కల దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను పంపింది భారత్. మాల్ దీవులు, భూటాన్ దేశాలకు బుధవారం టీకా చేరింది. తమకు ఏ ఆపదవచ్చినా సాయం చేసేందుకు భారత్ ముందుంటుందని మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ అన్నారు. ‘ఈ ఉదార బహుమతికి ప్రధాని నరేంద్ర మోడీ, భారత ప్రభుత్వం, ఆ దేశ ప్రజలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు’ తెలిపారు షాహిద్. ఇక మరోవైపు భూటాన్ కు కూడా టీకా చేరింది. భూటాన్ కు మొదటి విడతలో లక్ష వ్యాక్సిన్ లను పంపింది భారత్.

సీరం ఇన్సిస్ట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్‌ను అందించింది భారత్. కాగా మరో నాలుగు పొరుగు దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, సీషెల్స్‌ కూడా కరోనా టీకాలను కోరాయని, ఆయా దేశాలకు కూడా వీటిని ఎగుమతి చేసినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. పొరుగు దేశాలను కరోనా రహితంగా మార్చేందుకు భారత్ కృషి చేస్తుంది. దేశంలో కరోనా కట్టడితోపాటు పొరుగు దేశాల్లో కూడా కట్టడికి పూనుకుంది. ఈ నేపథ్యంలోనే వారు కోరినన్ని టీకాలను పంపుతుంది ప్రభుత్వం. ఇక భారత్ చేస్తున్న సేవలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి.

బుధవారం వరకు భారత్ నుంచి వాక్సిన్ స్వీకరించిన దేశాల్లో మాల్ దీవులు, భూటాన్, నేపాల్, బాంగ్లాదేశ్, మయన్మార్, సీషెల్స్ ఉన్నాయి. ఇవన్నీ భారత సరిహద్దు దేశాలే.

భారత్ నుంచి వ్యాక్సిన్ స్వీకరించిన దేశాలు ఇవే.